హీరోయిన్ల మాల్దీవుల వెకేషన్ కి కారణం దొరికేసింది…

ప్రస్తుతం కరోనా భయం చాలా వరకు తగ్గింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో జనాలు ఇళ్ళ నుండీ బయటకి రావడానికి పెద్దగా భయపడట్లేదు. కానీ టూరిజం కోసం ఇతర ప్రదేశాలకి వెళ్ళాలంటే సంశయిస్తున్నారు. దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. కానీ సినిమా తారలు మాత్రం వెకేషన్ కోసం మాల్దీవులకి పయనమవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా మాల్దీవులకి క్యూ కడుతున్నారు.

సోషల్ మీడియాని గమనిస్తుంటే హీరోయిన్లంతా మాల్దీవుల్లోనే సేదతీరుతున్నట్టు కనిపిస్తుంది. ఐతే హీరోయిన్లంతా ఇంతలా మాల్దీవులు వెళ్ళడానికి కారణం తెలిసింది. ఒక బాలీవుడ్ నటుడు చెప్పిన కథనం ప్రకారం, మాల్దీవుల్లోని రిసార్టుల ఓనర్లు, సినిమా సెలెబ్రిటీలకి ఆహ్వానం పలికారట. నష్టాల్లో కూరుకుపోయిన టూరిజాన్ని మెరుగుపరిచేందుకు తారలకి ఆహ్వానం పలికి ఉచితంగావసతి కల్పిస్తున్నారట. కాకపోతే వారి వెకేషన్ ట్రిప్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయమన్నారట. ఈ విధంగా టూరిజంపై ప్రజల్లో ఉన్న భయాలు తగ్గి వెకేషన్ కి వస్తారని అనుకుంటున్నారట.