విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ విడుదల

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం సమయానికి పూర్తి కాలేదు. దీంతో గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన గామి చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.  ఎట్టకేలకు ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే … ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో మొత్తం ముగ్గురి కథలు చూపించారు. ఒక పాత్ర ఊరిలో దేవదాసిగా ఉన్న మహిళ, మరో పాత్ర పరిశోధనశాలలో బంధీగా ఉన్న ఓ కుర్రాడు, మూడో పాత్ర హీరో అఘోర. ఈ మూడు పాత్రల్లోని కథని ఆసక్తి గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ లోని విజువల్స్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి . హాలీవుడ్ రేంజ్ లో ప్రతి సీన్ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version