ఐపీఎల్ స్పాన్సర్ ‌షిప్ నుంచి తప్పుకున్న ‘వివో’..!

-

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా చైనా దేశానికి చెందిన మొబైల్ కంపెనీ కొనసాగించడంపై భారతదేశంలో అనేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివో సంస్థ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి చైనీస్ కంపెనీ తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు గల కారణం గత నెలలో భారతదేశం – చైనా సరిహద్దు లలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వివిధ రంగాల నుండి చైనా వస్తువులను బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్లను నిషేధించిన సంగతి కూడా విదితమే.

ipl-2020
ipl-2020

ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్ గా కొనసాగడం మంచిది కాదని భావించిన వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి విరమించుకుంటున్నట్లు తెలియజేసింది.అయితే కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే తప్పుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ సంబంధించి వివో హక్కులను ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ. 2199 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వివో ప్రతి సంవత్సరం జరిగే లీగ్ లో రూ. 440 కోట్లు చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే తాజాగా జరిగిన ఐపిఎల్ సమావేశంలో చర్చల తర్వాత వివో కంపెనీని ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతుందని తెలిపిన బిసిసిఐ నిర్ణయాన్ని భారతదేశ ప్రజలు పెద్ద ఎత్తున విభేదించారు. ఇక ఈ విషయంలో బిసిసిఐ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐపీఎల్ ను బహిష్కరించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ పిలుపు ఇచ్చింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివో సంస్థ స్పాన్సర్ షిప్ నుండి ఎట్టకేలకు విరమించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news