మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టిన వైజాగ్ యువతి..వీడియో వైరల్

-

విశాఖలో గంజాయి మత్తులో ఓ యువతీ రెచ్చిపోయింది. వైఎంసిఏ దగ్గర మద్యం, గంజాయి మత్తులో అర్ధరాత్రి హల్చల్ చేసింది. యువతి నడిరోడ్డుపై బీరు తాగుతూ గంజాయి సిగరెట్ కాలుస్తుందని తెలియడంతో త్రీ టౌన్ ఏఎస్ఐ పివివి సత్యనారాయణ ప్రశ్నించారు.

దీంతో రెచ్చిపోయిన యువతి బీర్ బాటిల్ తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఏఎస్ఐ సత్యనారాయణ పై బీర్ బాటిల్ విసరగా, అది గోవింద్ అనే యువకుడి కంటికి తగిలింది. దీంతో అతడి కంటికి గాయం అయ్యింది. యువతిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, వాళ్లపై విరుచుకుపడింది. ఏఎస్ఐ పై బూతు పురాణం అందుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news