కామారెడ్డి జిల్లాలో గుహలో చిక్కుకున్న రాజు అనే యువకుడిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సిబ్బంది కాపాడారు. సుమారు 40 గంటలకు పైగా బాధితుడు రాజు గుహలో నరకయాతన అనుభవించాడు.
బండ రాళ్లను డ్రిల్లింగ్ మిషన్ తో తొలగించే సేఫ్ గా బయటకు తీశారు. కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం వేటకు వెళ్లిన రాజు, సెల్ ఫోన్ గుహలో పడగా అది తీసేందుకు ప్రయత్నించి గుహలో చిక్కుకుపోయాడు.