ఆధార్ కార్డు తరహాలోనే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు

-

ఆధార్ కార్డు తరహాలోనే ఓటర్ ఐడీ కార్డులను కూడా డిజిటల్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేసినట్లు తెలిసింది. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి ఆటోమేటిక్ గా ఈ సౌకర్యం లభిస్తుంది. ఇదివరకే ఓటరుగా నమోదు చేసుకొని ఉంటే… హెల్ప్ లైన్ యాప్ ద్వారా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకునే సమయంలో ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ కు లింక్ అయి ఉంటుంది. అప్పుడు సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


ఎన్నికల అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎపిక్ ఐడి కి రెండు క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ లో ఓటర్ సమాచారం, మరో క్యూఆర్ కోడ్ లో మిగిలిన సమాచారం ఉంటుంది. కొత్త ఫార్మాట్ అందుబాటులోకి వస్తే సర్వీస్ ఓటర్లు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు మారినప్పుడే తమ పేరును ఆ ప్రాంతంలో ఎన్రోల్ చేయించుకోవడం సులభంగా ఉంటుంది.పాత కార్డు తీసుకొని వెళితే కొత్త అడ్రస్ కు సంబంధించిన పత్రాఅందిస్తే అప్పుడు కొత్త అడ్రస్ తో ఓటర్ ఐడీ కార్డు వచ్చేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news