మాజీ రాజ్యసభ సభ్యులు వి. హన్మంతరావు ఇంట్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ నోము వ్రతాన్ని ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
అయితే, సీఎం రేవంత్ సహా కీలకమంత్రులు రావడంతో వీహెచ్ నివాసం పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.అంతేకాకుండా, ఆయా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.కార్తీకమాసం ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలు సైతం కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సైతం తిరిగి నగరం బాట పడుతుండటంతో ఔటర్ రింగు రోడ్డుపై భారీగా వాహనాల రద్దీ నెలకొన్నది.