తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడమే ఒక సవాల్ అయితే ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న తప్పులు మాత్రం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్నాయనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో కి వెళ్లి ప్రచారం చేయాలి. జనసేన పార్టీ నేతలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
కానీ బీజేపీ నేతలు అలాంటి ప్రయత్నం చేయటం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సందర్భంగా కొన్ని అంశాలు బాగా హైలెట్ అయ్యాయి. వైయస్ వివేకానంద రెడ్డి మరణం తో పాటుగా కొన్ని అంశాలను ఆయన ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై ఉంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు మీద దృష్టి పెట్టారు.
కాబట్టి ఆయన విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టిపెట్టి తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలి అని కోరితే మంచిది అని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రచారానికి వస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేసి ప్రచారం చేయిస్తే బాగుంటుందని కోరుతున్నారు.