మ్యాగీ నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. పిల్లలు, పెద్దలు వీటిని ఇష్టంగా తింటారు. వేగంగా అవడమే కాదు, రుచిగా కూడా ఉంటాయి. అందువల్లే మ్యాగీ నూడుల్స్‌కు అంత పేరు వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో మ్యాగీ నూడుల్స్‌ను కొందరు భిన్న రకాల ఆహారాలతో కలిపి తింటున్నారు. అందులో భాగంగానే ఢిల్లీకి చెందిన ఓ కేఫ్ మ్యాగీ నూడుల్స్ ను తమ కస్టమర్లకు వినూత్న రీతిలో సర్వ్ చేసింది.
ఢిల్లీలోని హడ్సన్ లేన్‌లో ఉన్న కేఫ్ హౌస్ ఫుల్ అనే కేఫ్ వారు మ్యాగీ నూడుల్స్ ను బీర్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. దీంతో బీర్ మ్యాగీ అనే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బీర్ మ్యాగీ నూడుల్స్ ను తినాలని ఉందని కొందరు అంటంటే, అబ్బే.. అదేం టేస్టు, బీర్‌తో కలిపి మ్యాగీ నూడుల్స్ ను తింటారా ఎవరైనా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే బీర్‌ను, మ్యాగీ నూడుల్స్ ను కలిపి అలా ఎలా వండారు ? అని సందేహాలు కలుగుతున్నాయి. వాటిని బీర్‌లో నానబెట్టి సర్వ్ చేస్తున్నారని కొందరు అంటుంటే.. లేదు, లేదు వండిన నూడుల్స్ ను బీర్‌లో కలిపి ఇస్తున్నారని.. కొందరు అంటున్నారు.
View this post on Instagram
కాగా మ్యాగీ నూడుల్స్ ను ఉత్పత్తి చేస్తే నెస్లె సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యాగీ నూడుల్స్ తో భిన్న రకాల వంటలను వండేందుకు రెసిపిలను చెప్పాలని యూజర్లను కోరింది. అందులో భాగంగానే ఆ నూడుల్స్ ను కొందరు రకరకాలుగా వండుతూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.