నాని వి.. థియేటర్లలోకి వచ్చేస్తుంది..

-

ఇంద్రగంటి మోహన దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా డీజిటల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు మరో హీరోగా రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి సరైన రివ్యూస్ రాలేదు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో అమెజాన్ వాళ్ళకి అమ్మేసారు. ఐతే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కేవలం యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే నడుస్తున్నప్పటికీ సినిమాలు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాని వి సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. 2021 జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే ఆల్రెడీ డిజిటల్ మాధ్యమంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న వి సినిమాని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఏమాత్రం వస్తారనేది సందేహంగా ఉంది. అదితీ రావ్ హైదరీ, నివేథా థామస్ హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news