అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా?

-

అనాథ పిల్లల్ని దత్తత తీసుకునేందుకు కొంతమంది ఆసక్తి చూపుతున్నారు.దీన్ని చట్టబద్ధంగా చేసుకుంటే న్యాయపరమైన గుర్తింపు కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలీ, లేటు వయస్సులో పెళ్లిల్లు చేసుకోవడం, స్ట్రెస్‌తో కూడా మరి కొంత మందికి పిల్లలు పుట్టడం లేదు. వారి ప్రయత్నాలన్నీ ముగిసిన తర్వాత అనాథ పిల్లలను దత్తతా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఒక అనాథను దత్తత తీసుకుంటే వారికి కుటుంబాన్ని ఇవ్వడంతోపాటు పిల్లలు కావాలనే తమ కోరిక కూడా తీరుతుందని ఇలా చేస్తున్నారు. కొంతమంది బాహాటంగా తీసుకుంటే.. మరి కొంత మంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కొన్ని ఏళ్లుగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కూడా దత్తతకు ప్రోత్సహిస్తున్నాయి.

 

వీరిని స్కూల్లో చేర్పించాలన్నా, బర్త్‌ సర్టిఫికెట్‌ పొందాలన్నా చట్టప్రకారం దత్తతును నమోదుచేయాల్సి ఉంటుంది. నోటి మాటగా చేసుకునే దత్తతు వల్ల భవిష్యత్తులో అనేక చట్టపరమైన సమస్యలు వస్తాయి. బాలబాలికలను దత్తత తీసుకునేటప్పుడు నియమ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. దత్తతకు భార్య అనుమతి తప్పనిసరి. ఒకవేళ ఒక్కరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వ్యక్తి, భార్యాలందరి దగ్గరా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ భార్య చనిపోయి లేదా బ్రహ్మచారి దత్తత తీసుకోవాలంటే.. అతడి మానసిక స్థితి సరిగా ఉందనే సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. చట్టపరమైన అనాథాశ్రమం నుంచి కేవలం ఆశ్రమ నిర్వాహకుడు మాత్రమే దత్తతకు అర్హులు. అది కూడా కేవలం 15 ఏళ్లు నిండిన పిల్లలను మాత్రమే దత్తత తీసుకోవడానికి వీలుంటుంది.

దత్తత తీసుకోవాలనుకునే దంపతులు, మొదట స్త్రీ– శిశు సంక్షేమశాఖ వెబ్‌సైట్లో లాగిన్‌ అవ్వాలి. దత్తతకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వారికి కచ్చితంగా పాన్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణ పత్రం, వివాహ నమోదు పత్రం, దంపతులిద్దరి బర్త్‌ సర్టిఫికెట్లు, హెల్త్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు కనీసం ఇద్దరు వ్యక్తుల నుంచి సిఫారసు కూడా అవసరం. భార్యభర్తలిద్దరి పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోతో పాటు 6 వేల రూపాయల డీడీ అప్లికేషన్‌ ఫారంతో పాటు 40 వేల రూపాయలను దత్తత తీసుకునే సమయంలో సంబంధిత అనాథాశ్రమానికి డీడీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version