లోకల్ నాన్ లోకల్ ఏంటి.. కళాకారులు యునివర్సల్ : ప్రకాశ్‌ రాజ్‌

-

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి మా అధ్యక్ష ప‌ద‌వికి విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్..బరిలో ఉండగా.. అతనిపై మిగతా అభ్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ తనదైన స్టైల్‌లో స్పందించాడు. లోకల్ నాన్ లోకల్ ఏంటి..?కళాకారులంతా యునివర్సల్ అని ప్రకాశ్‌ రాజ్‌ స్పష్టం చేశారు.

నేను రెండు గ్రామాలు దత్తత తీసుకుంటే నాన్ లోకల్ అనలేదని.. అవార్డులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదని మండిపడ్డారు. నిన్న, మొన్న ఆలోచించి తీసుకున్న మూమెంట్ కాదని… ఏడాదిగా ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ చేశామని తెలిపారు. మొదటి సారి మీడియాను చూసి భయం వేస్తోందని…మాది చిన్న అసోసియేషన్… ఊహాపుహాలు చూసి భయం వేసిందని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్.. అందరికి ఎంటర్ టైన్ గా మారిపోయిందన్నారు.

ఇక్కడ ఎదో జరుగుతోంది..చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించారు. కళ్ళ ముందు ఉన్న వాళ్ళు సగం మందే.. వాళ్ళు ఈ ఫామిలీ.. ఆ ఫ్యామిలీ అని ఫిక్స్ చేయొద్దని తెలిపారు. సైలెంట్ జిక్ గా వర్క్ చెయ్యాలనుకుంటున్నామని…మా ప్యానల్ లో గట్టిగా మాట్లాడే వాళ్ళున్నారని వెల్లడించారు.ఈ విషయంలో చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారని ఫైర్‌ అయ్యారు ప్రశాశ్‌ రాజ్‌. ఆవేదనతో పుట్టిన మా బిడ్డల ప్యానల్… మా ప్యానల్ అకౌంటబిలిటీగా ఉంటుందన్నారు. రాజకీయంగా నాకు నాగబాబు విరోధం ఉన్నా.. ఇక్కడ ఒక్కటేనని తెలిపారు. ఈ ప్యానల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మీడియా ముందుకు రావద్దని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాశ్‌ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version