కారు కొనాల‌ని అనుకుంటున్నారా ? మారుతీ సుజికి కార్ల‌పై డిస్కౌంట్లు..

-

కొత్త కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా ? రాయితీలు ఉంటే బాగుండును అనుకుంటున్నారా ? అయితే మీ లాంటి వారి కోస‌మే కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. దేశంలోని ప‌లు ఎంపిక చేసిన డీల‌ర్ల వ‌ద్ద కొన్ని ఎంపిక చేసిన కార్ల‌పై డిస్కౌంట్ల‌ను, ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ఏయే కార్ల‌పై ఈ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

want to buy a car maruthi suzuki offers discounts

నెక్సా డీల‌ర్లు

పాత కారును ఎక్స్ఛేంజ్ చేసి ఈ కారును కొంటే పాత కారుపై రూ.15వేల వ‌ర‌కు అద‌నంగా ఎక్స్ఛేంజ్ బోన‌స్‌ను ఇస్తారు. రూ.3వేల వ‌ర‌కు కార్పొరేట్ డిస్కౌంట్‌, రూ.12,500 వ‌ర‌కు క్యాష్ డిస్కౌంట్ ల‌భిస్తాయి. ఇగ్నిస్ కారుపై ఈ ఆఫ‌ర్లు ల‌భిస్తాయి. అదే బ‌లెనో అయితే రూ.3వేలు కార్పొరేట్ డిస్కౌంట్‌, రూ.10వేలు ఎక్స్ఛేంజ్ బోన‌స్‌, రూ.12,500 క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. ఇక మారుతి సుజికి ఎస్‌-క్రాస్ కారుపై రూ.15వేల క్యాష్ డిస్కౌంట్‌, రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్‌, రూ.15వేల వ‌ర‌కు ఎక్స్ఛేంజ్ బోన‌స్ ల‌భిస్తాయి. సియాజ్ కారుపై రూ.15వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్‌, రూ.10వేల క్యాష్ డిస్కౌంట్‌, రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్ ల‌భిస్తాయి.

ఎరీనా

ఈ డీల‌ర్ల వ‌ద్ద మారుతి సుజికికి చెందిన అన్ని హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ మోడ‌ల్స్‌పై రూ.20వేల వ‌ర‌కు ఎక్స్ఛేంజ్ బోన‌స్‌, రూ.10వేల వ‌ర‌కు క్యాష్ డిస్కౌంట్ ల‌భిస్తాయి. వాగ‌న్ ఆర్ మోడ‌ల్‌పై రూ.15వేల వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌, రూ.8వేల వ‌ర‌కు క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. సీఎన్‌జీ వేరియెంట్ల‌పై రూ.5వేల క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ప‌లు ఇత‌ర మోడ‌ల్స్ పై క్యాష్ డిస్కౌంట్ల‌ను కూడా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news