ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే…!

-

పైచదువులు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాలి. అందుకని ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారు. ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతుంటారు. అలాంటి వాళ్లకి బ్యాంకులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాయి. చాలా తక్కువ వడ్డీకే విద్యా రుణాలను పలు బ్యాంకులు ఇస్తున్నాయి.

భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు కేవలం 6.75% వడ్డీ రేటు నుంచే విద్యారుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గరిష్ట రుణంపై ఎటువంటి పరిమితి లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్తోంది. భారతదేశంతో పాటు విదేశీ విద్యకు సైతం ఈ రుణాలు తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన 6 నెలల నుంచి లోన్ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది.

అలానే ఎస్‌బీఐ తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ అందజేస్తుంది. మహిళా విద్యార్థులకు రాయితీపై రూ.20 లక్షల వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. రూ. 7.5 లక్షల వరకు లోన్ కూడా హామీ లేకుండా ఇస్తోంది. కోర్సు పూర్తయిన 12 నెలల తర్వాత లోన్ రీపేమెంట్ ప్రక్రియ మొదలవుతుంది. అదే యాక్సిస్ బ్యాంక్ అయితే గరిష్టంగా రూ. 1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ అందజేస్తుంది. 15 సంవత్సరాల గరిష్ట రుణ వ్యవధిని అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు లేకుండానే రూ.4 లక్షల వరకు రుణం ఇస్తుంది. కోర్సు పూర్తయిన 6 నెలల నుంచి లోన్ రీపేమెంట్ మొదలవుతుంది. ఇది ఇలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా లో అయితే గరిష్టంగా రూ. 80 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. గరిష్టంగా 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిపై రుణాలు ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో అయితే గరిష్టంగా రూ.20 లక్షలు, విదేశాల్లో అయితే రూ.35 లక్షల వరకు రుణాలు అందజేస్తుంది. 15 సంవత్సరాల వ్యవధిపై ఈ రుణాలను అందజేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news