ఏదైనా మంచి చోటుకి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఈ అందమైన సరస్సులని చూసి వచ్చేయండి..!

మీరు ఏదైనా మంచి ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారా..? మీ బాధల నుండి కాస్త రిఫ్రెష్ అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే మన భారతదేశంలో ఉండే ఈ సరస్సులకి వెళ్లి రండి. అందమైన సరస్సుల మధ్య కుటుంబం అంతా కాసేపు గడిపితే ఎంతో ఆనందంగా ఉంటుంది. లేదంటే మీరు మీకు ఇష్టమైన వారితో అయినా వెళ్ళచ్చు. పైగా మరచిపోలేని ట్రిప్ అవుతుంది. మరి భారత దేశంలో ఉండే అందమైన సరస్సులు గురించి ఇప్పుడు చూద్దాం.

దాల్ సరస్సు:

ఇది శ్రీనగర్ లో ఉంది చాలామంది పర్యాటకులు ఇక్కడికి వెళుతూ ఉంటారు. శీతాకాలంలో అయితే గడ్డకట్టుకుపోతుంది. చాలా అందంగా ఉంటుంది ఈ సరస్సు.

చిల్కా సరస్సు:

ఇది ఒడిస్సా లో ఉంది. ఉప్పునీటి సరస్సు ఇది. దేశంలో తీర ప్రాంత సరస్సుల్లో ఇది చాలా పెద్ద సరస్సు. వలస పక్షులతో శీతాకాలం ఈ ప్రాంతమంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది.

సత్తల్ సరస్సు:

ఇది ఉత్తరాఖండ్ లో ఉంది ఈ సరస్సు చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి ఉంటుంది చక్కగా కుటుంబంతో కానీ మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ ఇక్కడికి కూడా మీరు వెళ్లి వచ్చేయొచ్చు.

వెంబనాడ్ సరస్సు:

కేరళలో ఇది ఉంది. పర్యటకులు ఈ సరస్సును చూడడానికి కూడా వస్తూ ఉంటారు శీతాకాలంలో వెళ్లేందుకు ఇది కూడా మంచి ప్రదేశం.

పుష్కర్ సరస్సు:

దీని చుట్టూ 5 హిందూ దేవాలయాలు ఉన్నాయి దీనిని పుష్కర సరోవర అని కూడా పిలుస్తారు. సంవత్సరం పొడవునా కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది వెళ్తూ ఉంటారు.

లోకతక్ సరస్సు:

ఇది మణిపూర్ లో ఉంది ఈ సరస్సు పై కీబుల్ నేషనల్ పార్క్ ఉంది ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడకి కూడా వెళ్లి వచ్చేయొచ్చు.