నిన్న ఉదయం బీసీసీఐ వెస్ట్ ఇండీస్ టెస్ట్ ల కోసం ఇండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ జట్టులో కూర్పు గురించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ ఇండియా ప్లేయర్ వసీం జాపర్ షాక్ అయిన విషయంన్ని తెలియచేశాడు. వసీం జాఫర్ మాట్లాడుతూ వెస్ట్ ఇండీస్ టెస్ట్ ల కోసం నలుగురు ఓపెనర్ లను సెలెక్ట్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. అస్సలు నాలుగు ఓపెనర్లు అవసరమా అంటూ బీసీసీఐ ని ప్రశ్నించాడు. వారికి బదులుగా దేశవాళీ టోర్నీ రంజీ ట్రోపీలలో నిలకడగా రాణిస్తున్న యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇతను కాకుండా అభిమన్యు ఈశ్వరన్ మరియు ప్రియాంక పంచల్ లు కూడా సరైన వారే అంటూ సలహా ఇచ్చారు. ఐపీఎల్ ఆడిన వారిని మాత్రమే టెస్ట్ ల ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నించాడు.