ప్రస్తుతం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి సరిగ్గా 10 గంటల 15 నిముషాలకు కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలతో పాటుగా.. హైద్రాబాద్ లోని జూబిలీ బస్టాండ్ నుండి రాజీవ్ రహదారి వరకు స్కై వే నిర్మాణం, పారడైజ్ చౌరస్తా నుండి మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ వరకు మరో స్కై వే నిర్మాణం కొరకు రక్షణ శాఖ భూములను కేటాయించాలని అమిత్ షా ముందు ఉంచనున్నారు. కాగా ఈ రోజు ఉదయం మరో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ తో సమావేశం అయ్యి మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా ఇప్పుడు అమిత్ షా తో భేటీ కానున్న విషయమే పెద్దది అని చెప్పాలి.
మరి తెలంగాణాలో బీజేపీ మరియు అధికార BRS లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతున్న వేళ ఇవన్నీ సాధ్యం అవుతాయా అన్నది ప్రశ్నార్ధకమే.