తీపి తినడం అనేది చాలా మందికి ఇష్టం. కొంత మంది అతిగా తింటే మరికొంత మంది తక్కువ తింటారు. ఇక పంచదార అనేది మన జీవితంలో ఎక్కువగానే వాడే పదార్ధం. అయితే దానికంటే బెల్ల౦ వాడకం తీపిలో మంచిది అంటున్నారు వైద్యులు.
బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉండటంతో శరీరానికి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం అసలే ఉండదట. అదే విధంగా కొన్ని అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం అద్భుతంగా చేస్తుందని అంటున్నారు. రాత్రిపూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుందట. అంతే కాకుండా బెల్లం మన శరీరానికి లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుందట.
రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయని, లివర్ శుభ్రంగా ఉంటుందని అంటున్నారు. కాలేయ సంబంధ అనారోగ్యాలు దరి చేరే అవకాశం ఉండదని అంటున్నారు. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయట. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుందని,మన శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుందట.
అధిక బరువు తగ్గుతారని అంటున్నారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయట. బెల్లం బ్లడ్‌ఫ్యూరిఫయర్‌లా బెల్లం పనిచేస్తుందట. దీన్ని తరచూ కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందని సూచిస్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచడంతో పాటు, రక్తహీనతను తగ్గిస్తుందని అంటున్నారు. బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయట. ఇవి శరీరంలోని యాసిడ్ లెవెల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని సూచిస్తున్నారు.