ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సూర్య, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు సాధించారు. అయినా చివర్లో రింకు సింగ్ కేవలం 14 బంతుల్లోనే 22 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఫినిషర్ పాత్రను రింకు సమర్థవంతంగా పోషించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఫినిషర్ పాత్రను రింకు సమర్థవంతంగా పోషించాడు. ఇప్పుడు ఆసీస్ తో తొలి టీ20లోనూ అలాగే ఆడేశాడు.
స్వల్ప వ్యవధిలో వికెట్లు పడిన ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో రింకుసింగ్ ఆటను చూసిన తరువాత అభిషేక్ నాయర్ తప్పకుండా గుర్తుకు వస్తాడని టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తిక్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అభిషేక్ నాయర్ కేకేఆర్ కి సహాయక కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అభిషేక్ నాయర్ రింకు సింగ్ మధ్య బంధం 2018లో మొదలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఎంపికైన రింకు సింగ్ లోని బ్యాటింగ్ పవర్ ను అభిషేక్ నాయర్ గుర్తించాడు. తప్పకుండా అతడు ప్రత్యేకంగా నిలుస్తాడని ఆనాడే అభిషేక్ నాతో చెప్పాడు. అలీగడ్ లోని చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఇలా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం అద్భుతమనే చెప్పాలి.