మనిషి మనుగడకి నీరు చాలా ముఖ్యమైనది. అలాంటి నీరును సంరక్షించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విమర్శలు వినపడుతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న జనాభాతో నీరు అవసరం చాలా ఉంది. నీరు కూడా అంతే పెద్ద ఎత్తున అవసరం ఉంటుంది.
ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. కురిసిన వర్షాలకు అన్ని డ్యాములు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇంకా ఏవో నుండి వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీరును సముద్రానికి వదులుతున్నారు. ఇలా సముద్రం పాలవుతున్న నీరంతా చూసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత స్థాయి నీరు వృధా అవుతుంటే ప్రభుత్వాలు మాత్రం నీటిని సంరక్షించడంలో విఫలమవుతున్నారని.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం వహించడంతో.. ఇలా వస్తున్న మంచి నీరు అంతా వృధా అయిపోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటం మాత్రం అలానే ఉండిపోయింది. దాంతో పాటు ప్రకాశం జిల్లా వాసులకు కామదేనువు లాంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం వహిస్తే ఉండడంతో ప్రకాశం జిల్లా వాసులు నీటి కోసం కటకటలాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా మారుతుంది.
పోలవరం ప్రాజెక్టు కూడా దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు దాదాపు ఈ నీరు చేరుకునే అవకాశం ఉంది. వేసవి కాలంలో నీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నీటి ఎద్దడి లేకుండా పోతుందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రభుత్వాలు మారుతూ.. కాలయాపన చేయడం వల్ల నిర్మాణ పనుల వ్యయం పెరగడమే కాకుండా.. ప్రభుత్వాలు మారుతూ ఉండటంతో ప్రాజెక్టులలో అవినీతి జరిగిందా..? అంటూ ఆరోపణలు చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరగడం వల్ల.. కూడా ప్రాజెక్టులు పూర్తి కావడం కష్టతరంగా మారాయి. దీంతో ప్రాజెక్టులో పూర్తి అయ్యేనా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతివృష్టి.. అనావృష్టి లాగా.. నీరు ఉన్నప్పుడు ఒకలాగా.. నీరు లేనప్పుడు వేరే లాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. నీటిని సంరక్షించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.