రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఆదివారం ఉదయం నీటిని కిందికి విడుదల చేశారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని వదిలారు. సాగర్ ఇన్ ఫ్లో 1.54 లక్షలు, ఔట్ ఫ్లో 47,817 క్యూసెక్కలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 295 టీఎంసీలుగా నమోదు అయింది. నాలుగేళ్ల తర్వాత నాగార్జున సాగర్ జలాశయం నిండటంతో పాటు నీటిని దిగువకు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.