వేసవిలో విరివిగా లభించేవి మామిడి పళ్ళు, పుచ్చకాయలు. అయితే పుచ్చకాయల తినడం వల్ల మన శరీరంలోని వేడిని తగ్గించి దాహర్తి ని తీరుస్తుంది. అయితే నేడు దేశంలో కరోన వైరస్ అంతకంతకు పెరుగుతున్న ఈ తరుణంలో పుచ్చకాయలు కొనాలన్నా భయపడుతున్నారు. అయితే పుచ్చకాయలు కొనుక్కుని వాటిని శుభ్రంగా ఉప్పు నీటితో కడిగిన తరువాత నాలుగు గంటలకు ముక్కలు కోసుకుని తినవచ్చు. ఇక పోతే మనం పుచ్చ ముక్కలు తిని గింజలను పడేస్తాము. కాని పుచ్చగింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి.
1.పుచ్చ గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే అమైనో ఆసిడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా చేసి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
2. ఈ గింజలలో ఉండే సాచురేటేడ్ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్నందున శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు లేకుండా సమర్థవంతంగా పని చేస్తుంది.
3. పుచ్చకాయలో ఉండే ప్రోటీన్స్, అమైనో ఆసిడ్స్ శరీరంలో రక్తపోటు ని తగ్గించడంలో సహాయపడతాయి.
4. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్ధం పురుషులలో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
5. పుచ్చగింజలలో ఎల్ సిట్రులిన్ సమృద్దిగా ఉంది కండరాల యొక్క బలాన్ని పెంచుతుంది. మరియు కణజాలాన్ని రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.
6. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి.
7. అంతేకాక పుచ్చగింజలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఏకాగ్రత పెరగడానికి కండరాల కదలికలు సరిగా పనిచేయడానికి తోడ్పడతాయి.
8. ఈ గింజల్లో ఉండే ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడుని రక్షిస్తుంది.