కరోనాతో చచ్చిపోతున్నా, నువ్వు మరో పెళ్లి చేసుకో, భార్యకు భర్త లేఖ…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి జనాలు వేలాది మంది ప్రతీ రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు రోజుకి మరణాలు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఒక మరణం మాత్రం ఆందోళన కలిగించింది. ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. దీనితో అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది.

important days for house warming and marriages, functions in magha masam 2019

తనకు మరణం తప్పదు అని తెలుసుకున్న ఆ వ్యక్తి తన భార్యకు లేఖ రాసాడు. తాను చనిపోతున్నా కాబట్టి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని లేఖ రాసాడు. అమెరికాకు చెందిన జోనాథన్‌ అనే వ్యక్తికి భార్య కేటీ, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ నేపధ్యంలో అతను ఈ లేఖ రాసి వారికి ధైర్యం చెప్పాడు. తనకు తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో కూడా చెప్పాడు.

‘నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. నేను ఎప్పుడూ కోరుకొని, ఊహించని ఉత్తమైన జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావ్… నీ ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతుడిని. అంతేగాక నీకు భర్తగా.. బ్రాడిన్‌, పెన్నీలకు తండ్రిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను చూసిన అమ్మాయిల్లో అత్యంత అందమైన, వ్యక్తిత్వం, కేరింగ్‌ ఉన్న మహిళవు కేటీ. నా పిల్లలకు ఉత్తమైన తల్లిగా నిన్ను చూసిన ఆ క్షణం నా జీవితంలో అత్యంత అద్భుతమైనది.

కేటీ, నిన్ను ప్రేమించే వ్యక్తి జీవితంలో నీకు ఎప్పుడైన ఎదురై.. మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటే అతడిని నువ్వు తిరస్కరించకని ఆ లేఖలో ఆమెకు సూచించాడు. తన భర్తకు సంబంధించిన వస్తువులను ఆసుపత్రి సిబ్బంది కేటీకి ఇవ్వడంతో వాటిని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళగా అందులో ఈ లేఖ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news