చైనా, ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ల‌ను న‌మ్మలేం.. సొంత వ్యాక్సిన్లు కావ‌ల్సిందే..

-

క‌రోనా వైర‌స్‌కు గాను ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్ర‌స్తుతం ప‌లు ద‌శ‌ల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. అమెరికా, ర‌ష్యా, చైనా, భార‌త్‌, బ్రిట‌న్ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజ‌లో ఉన్నాయి. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆయా దేశాలు వ్యాక్సిన్‌ను ప్ర‌జా పంపిణీకి సిద్ధం చేయాల‌ని భావిస్తున్నాయి. అయితే చైనా, ర‌ష్యా దేశాలు త‌యారు చేస్తున్న క‌రోనా వ్యాక్సిన్‌ను న‌మ్మ‌లేమ‌ని ప్ర‌ముఖ అమెరిక‌న్ సైంటిస్టు ఆంథోనీ ఫాసీ అన్నారు.

we can not trust china and russia corona vaccines

చైనా, ర‌ష్యా దేశాల్లో ఎలాంటి టెస్టులు, ట్రయ‌ల్స్ చేప‌ట్ట‌కుండా నేరుగా వ్యాక్సిన్‌ను పంపిణీకి సిద్ధం చేస్తున్నార‌ని, దీంతో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఫాసీ అన్నారు. అస‌లు ఆయా దేశాల క‌రోనా వ్యాక్సిన్ల‌ను ఏమాత్రం న‌మ్మ‌లేమ‌ని, వాటితో ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, క‌నుక సొంతంగా వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసేకోవాల్సిందేన‌ని అన్నారు.

కాగా ఇప్ప‌టికే అమెరికా ప్ర‌తీసారీ క‌రోనా వైర‌స్‌కు చైనానే దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. నిజానికి చైనాలోని వూహాన్‌లోనే క‌రోనా వైర‌స్ ఉద్భ‌వించిన‌ట్లుగా అంద‌రూ చెబుతున్నా.. అమెరికా మాత్రం ఈ విష‌యం చాలా సీరియ‌స్‌గా ఉంది. ఇత‌ర దేశాల క‌న్నా అమెరికానే ఎక్కువ‌గా ఈ విష‌యం ప‌ట్ల స్పందిస్తోంది. అయితే క‌రోనా వ్యాక్సిన్ రేసులో ఏ దేశం మొద‌టి స్థానంలో నిలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news