హైదరాబాద్ మరో ఢిల్లీ కావొద్దనే ఆ పాలసీ తీసుకొచ్చాం : మంత్రి పొన్నం

-

హైదరాబాద్ మరో ఢిల్లీ కావొద్దనే ఉద్దేశ్యంతోనే ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాలుష్యానికి నెలవుగా మారిన దేశరాజధానిలా హైదరాబాద్ కావొద్దనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్‌లో కాలుష్యం క్రమంగా పెరుగుతోందన్నారు.

అందుకే ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిందని, బ్యాటరీ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆ రాయితీలు మరో రెండేళ్ల పాటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పరిమితమైన వాహనాలకు మాత్రమే రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయితీల పరిమితిని ఎత్తివేసి అపరిమితం చేశామన్నారు. కొత్త ఈవీ పాలసీతో వాహనాల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి రక్షించుకునే బాధ్యత వాహనదారులపై కూడా ఉందని మంత్రి స్పష్టంచేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version