మోడీ గారు…రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు అంటూ కామెంట్స్ చేశారు KTR.
Modi గారూ..కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు…కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు అంటూ సెటైర్లు పేల్చారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా..కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా.. విశ్రమించకుండా పని చేస్తున్నారు అంటూ చురకలు అంటించారు.
చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం ‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు అని ఆరోపణలు చేశారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు! రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు అంటూ ఆగ్రహించారు. హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు అని చురకలు అంటించారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు…తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉందని చెప్పారు.
Modi గారూ..
కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు
కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు!చోటేభాయ్ కు వ్యూహకర్తగా…
కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా..
విశ్రమించకుండా పని చేస్తున్నారు!చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం
‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని… pic.twitter.com/UQTLiUw9qP— KTR (@KTRBRS) November 28, 2024