kcr press meet : కృష్ణ జలాలో మా వాట ను తెల్చాలి

-

సెక్ష‌న్ 3 ఏర్పాటు చేసి కృష్ణ జ‌లాల‌ను త‌మ రాష్ట్ర వాట పంచాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. నీటి వాట తెలితే పక్క రాష్ట్రాల తో ఎలాంటి కిరి కిరి ఉండ‌ద‌ని అన్నారు. ఏడెళ్లు గా నీళ్ల పంచాయితి ని తెల్చ‌డం లేర‌ని అన్నారు. కృష్ణ తో పాటు గోదావ‌రి న‌దుల‌లో త‌మ రాష్ట్ర వాట త‌ప్ప‌కుండా ఆలస్యం లేకుండా తెల్చాల‌ని డిమాండ్ చేశారు. నీటి వాట ల‌ను తెల్చ‌లేక పోవ‌డం వ‌ల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజ‌లు తీవ్రంగా న‌ష్ట పోతున్నార‌ని తెలిపారు.

ఈ విష‌యాన్ని రేపు ఢిల్లీ టూర్ లో లేవ‌నెత్తుతామ‌ని తెలిపారు. ఈ కృష్ణ‌, గోదావ‌రి న‌దుల వాట తెల్చాల‌ని కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి తో మాట్లాడుతామ‌ని తెలిపారు. త‌ప్ప‌ని స‌రిగా తెలంగాణ రాష్ట్ర వాట ను పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏడెళ్లు గా తెలంగాణ రాష్ట్ర రైతులు ప్ర‌జ‌లు నీటి వాట ను తెల్చ‌లేక పోవ‌డం పై చాలా న‌ష్ట పోతున్నార‌ని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news