రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌కు సవాల్ విసరడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. రుణమాఫీ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అద్దంకి ఎక్స్ వేదికగా స్పందించారు. గత బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేళ్ల పాలనలో లక్ష లోపు రుణమాఫీ చేయలేకపోయారని తప్పుబట్టారు. ఎన్నికలు వస్తున్నాయని కేంద్రాన్ని బ్రతిమిలాడుకుని చేసిన రుణమాఫీ లక్షలోపు ఉంటే.. 2023లో చేసిన రూ.9వేల కోట్లపై చిలుకు రుణమాఫీ లక్ష లోపు ఎలా ఉంటాయో? కేటీఆర్ ఆలోచన చేయాలన్నారు.
ఒకే ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిందని, బీఆర్ఎస్ హామీ ఇచ్చిన రైతు బంధు కోసం రూ. 10 వేల కోట్లు.. రైతు భరోసా కోసం మరో రూ. 10 వేల కోట్లు.. ఇలా కేవలం ఒక్క ఏడాదిలో రైతుల కోసం 40 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అయితే, రుణమాఫీ 100 శాతం ఎక్కడ అయ్యింది? ఎక్కడికి పోదాం? అని కేటీఆర్ ఎలా సవాళ్లు విసురుతున్నారని.. సిగ్గు అనిపించడం లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.