పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మరోసారి కుల వివక్ష అనేది వెలుగుచూసింది. తన కూతురిని ఇతర కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడని కక్ష గట్టిన అమ్మాయి తండ్రి అతన్ని దారుణంగా హత్య చేశాడు.
పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండల పరిధిలోని ముప్పిరితోటలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని, తరచూ కలుస్తున్నాడని అతనిపై కోపం పెంచుకున్న తండ్రి.. గొడ్డలితో అతి కిరాతకంగా హతమార్చాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న డీఎస్పీ, పోలీసు సిబ్బంది అక్కడ పరిస్థితిని సమీక్షించారు.నిందితుడి ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతి తండ్రి సదయ్యను చీమలపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.