చంద్రబాబు ఇచ్చిన ప్రతీ వాగ్ధానానికి కట్టుబడి ఉంటాం : వర్ల రామయ్య

-

ప్రజల తీర్పు ప్రకారమే కూటమి పాలన నడుస్తుందని వర్లరామయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు చేసుకుంటున్నారు.ఈ వేడుకల్లో వర్లరామయ్య, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చిందని అన్నారు.

వైఎస్ జగన్ రెడ్డి అరాచక, అవినీతి, విధ్వంసక, నియంత పాలన తమకొద్దని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం మొదట 5 ఫైళ్లపై సంతకం చేశారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతీ వాగ్ధానానికి కట్టుబడి ఉంటాం.. ప్రతీ హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖారావం పూరించారని వర్లరామయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news