ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం : సీఎం రేవంత్ రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆదివాసులను ఇందిరమ్మ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఆనాడు దళిత గిరిజన సభను విజయవంతం చేశారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన అడ్డంకులు సిద్ధించిన వెన్నక్కి తగ్గలేదు అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని అప్పుడు సమర శంఖాన్ని పూరించాం.  ఇచ్చిన మాట ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసులపై కాల్పులు జరిపినందుకు క్షమాపణలు కోరాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నాం. అమర వీరులకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నచారు. 15 రోజులు 15 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొన్న దాదాపు 7వేల స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని.. ఎల్బీ స్టేడియంలో వారికి నియామక పత్రాలను అందజేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version