తాడేపల్లి కోట కూడా కూలగొడతాం : పవన్ కళ్యాణ్

-

సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. ‘సొంత బాబాయ్ ని చంపించాడు. సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టాడు అని, వీళ్లా నాకు సలహాలు ఇచ్చేది’ అంటూ ఫైర్ అయ్యారు. తెలిపారు.జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ….’అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మనకు వేల కోట్లు డబ్బులున్నాయా? టీడీపీలా బలమైన సంస్థాగత వ్యవస్థ ఉందా? ఇప్పుడిప్పుడే జనసేన ఇళ్లు కడుతున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. కోట కూడా కడతాం. తాడేపల్లి కోట కూడా కూలగొడతాం’ అని హెచ్చరించారు.

చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టడం తనను బాధించిందని అని అన్నారు. ‘ఆయన భార్య భువనేశ్వరిని అనకూడని మాటలు అంటే బాధ కలిగింది మండిపడ్డారు. తన కుమార్తె చనిపోయిందని సుగాలి ప్రీతి తల్లి చెబితే.. 2 చోట్ల ఓడి కూర్చున్న నాకు నిస్సహాయతగా అనిపించింది తెలిపారు. అందరూ కష్టాలు చెబుతుంటే చలించాను. వీళ్ల కోసం నేను నిలబడకపోతే.. రేపు నాకోసం ఎవరూ నిలబడరు. అందుకే పొత్తుకు ప్రతిపాదించా’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news