సోనామసూరి పండించే రైతులకు కూడా బోనస్ అందిస్తాం : మంత్రి తుమ్మల

-

రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు పూర్తిగా సహకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆహార భద్రత తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రపంచ వరి శిఖరాగ్రసదస్సు హైదరాబాద్ తాజ్ హోటల్ వ్యవసాయ శాఖ మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి ధాన్యం పండించే రైతులకు తమ ప్రభుత్వం విత్తనాలను అందిస్తుందని అలాగే కనీసం మద్దతు ధన కల్పిస్తుందని తెలిపారు. ఈ సీజన్ నుంచి సోనామసూరి పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఉందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 12 మిలియన్ ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తున్నారని ఆయన తెలిపారు. ద్వారా 26 మిలియన్ టన్నుల బియ్యం ఉద్యమం తెలిపారు తెలంగాణలో 225 వెరైటీ రైస్ ను పండిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి సోనామసూరి, సాంబ మ సూరి, హెచ్ఎంటి, 1010 బాయిల్డ్, ఐ ఆర్ 64 స్టీమ్ రైస్ వంటి పలు రకాలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ అమెరికా బంగ్లాదేశ్ యునైటెడ్ లండన్ దేశాలకు ఎగుమతులు ఎక్కువగా అవుతున్నాయని ఆయన తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news