ఆంధ్ర ప్రదేశ్ లో వరదల లో నష్ట పోయిన కడప జిల్లా ను ముఖ్య మంత్రి జగన్ సందర్శించారు. రాష్ట్రంలో వచ్చిన వరదల వల్ల వచ్చిన నష్టాన్ని ఎవరూ పూడ్చ లేరని సీఎం జగన్ అన్నారు. అలాగే ఈ వరదలలో ఇల్లు కొల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం తో పాటు ఇల్లు ను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండు డ్యాం లు కొట్టుకు పోవడం వల్ల పొలాల్లోకి ఇసుక మట్టలు వచ్చాయని అన్నారు. ఇసుక మట్టలు వచ్చిన ప్రతి హెక్టర్ కు రూ. 12,000 పరిహారం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఈ క్రాప్ నకు నమోదు చేసుకున్న వారికి కూడా పరిహారం చెల్లి స్తామని ప్రకటించారు. చదువుకున్న యువకులకు, వాహానాలను కొల్పోయిన వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే జాబ్ మేలాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే వరదల సమయంలో అధికారుల పని తీరు బాగుందని అన్నారు. డ్యామ్ లను రీ డిజైన్ చేసి కట్టేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వరద నీరు గ్రామాల్లోకి రాకుండా గొడలు నిర్మిస్తామని ప్రకటించారు.