వచ్చే యాసంగి లో తెలంగాణ రైతులు ఏ పంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చాక క్లారిటీ గా చెబుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. తాను రేపు అందరి మంత్రులతో, ఎంపీ లతో, అన్ని శాఖ ల అధికారులతో ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరి ధాన్యం గురించి మాట్లాడుతామని తెలిపారు. ఒక ఏడాది కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత వరి ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం తెలుసుకుంటామని ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు.
కేంద్రం స్పందన చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పంటలు వేయాలో ఆలోచిద్దామని తెలిపారు. కాగ ఇప్పటికే అనురాధ కార్తే వచ్చిందని తెలిపారు. ఈ ఇప్పుడు వరి ధాన్యం గురించి కేంద్రం క్లారిటీ ఇస్తే మనం ఆ పంట వేసు కుంటామని తెలిపారు. కేంద్రం స్పందన వచ్చే వరకు రైతులు వేచి చూడాలని రైతులను ముఖ్య మంత్రి కేసీఆర్ కోరాడు.