టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో ఆమె నివాసముంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఉంటున్న భవనంలో ని 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్క సారిగా రావడం తో స్థానికులు షాక్ కు గురి అయ్యారు. అలాగే అక్కడ ఉన్న కొంత మంది స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రకుల్ ప్రీత్ సింగ్ నివాసానికి వచ్చారు. అలాగే చేలరేగుతున్న మంటలను అదుపు చేశారు.
అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నీ ప్రమాదం సమయంలో హీరోయిన్ రకుల్ షూటింగ్ తన నివాసం లేదు. షూటింగ్ కోసం ఇతర ప్రాంతంలో ఉంది. ఈ విషయం తెలిసిన రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మంటలు ఎలా వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.