ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి ఉక్రెయిన్ దేశంలో రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం పై పట్టు సాధించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. కాగ అంతర్జాతీయం గా దేశాల మద్దతు లేకుండా.. ఉక్రెయిన్ ఓంటరిగానే రష్యాతో యుద్ధం కొనసాగిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన వందల మంది సైనికులు, పౌరులు మృతి చెందారు.
యుద్ధంపై చర్చలు జరుగుతున్నా.. రష్యా మరో పక్క తన బలగాలతో ఉక్రెయిన్ పై దాడులు చేస్తునే ఉంది. తాజా గా యుద్ధంపై రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై తాము చేస్తున్న యుద్ధం ఆపేది లేదని స్పష్టం చేసింది. తమ యుద్దం కొనసాగుతుందని ప్రకటించింది. అన్ని లక్ష్యాలు నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపబోమని తెల్చి చెప్పింది. కాగ ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారతీయులు ఉంటే.. తక్షణమే బయటకు వెళ్లి పోవాలని భారత్ కూడా తమ పౌరులను హెచ్చరించింది. అంటే ఈ యుద్ధం వేడి ఇంకా చల్లరలేదు.. ఇంకా పెరిగిందని తెలుస్తుంది.