బండి సంజయ్ అబద్ధపు ప్రచారాలు ఆపకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్

-

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ వి హాస్యాస్పదమైన, ఆధార రహితమైన ఆరోపణలు అని కేటీఆర్ పేర్కొన్నారు. సంజయ్.. ఆధారాలు ఉంటే నిరూపించు… లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ప్రచారం కోసం సంజయ్ వాక్చాతుర్యం ప్రదర్శించద్దన్నారు. నిరాధార ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

అయితే ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలతో మాట్లాడుతూ.. 27 మంది ఇంటర్ విద్యార్థుల చావులకు కారణం కేటీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ నియోజకవర్గంలోనే ఇంటర్ విద్యార్థని ఆత్మహత్యాయత్నం చేసి చనిపోయిందని అన్నారు బండి సంజయ్. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోలేదని, కొండగట్టు బస్సు ప్రమాదం పై మాట్లాడలేదని, పేదలు చనిపోతే కెసిఆర్ పరామర్శకు రాడని, ధనవంతులు చనిపోతేనే వెలతారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news