కేంద్ర విద్యుత్ ఉత్తర్వులపై న్యాయపోరాటం చేపడతాం – మంత్రి జగదీష్ రెడ్డి

-

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్తర్వులపై జిల్లా కేంద్రంలో మీడియా తో మాట్లాడారు మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినవి , పూర్తి అసంభద్దమైన ఉత్తర్వులు అని మడిపడ్డారు. కేంద్ర విద్యుత్ ఉత్తర్వుల పై న్యాయపోరాటం చెపడతామన్నారు. తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ఉత్తర్వులు ఉన్నాయన్నారు.

అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పడం బీజేపీ కి రుచిచడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారని తెలిపారు. తెలంగాణాకు 12,941 కోట్లు రావాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణా వాదనలు వినకుండా ఆంధ్ర వాదనలు విని కేంద్రం ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. విద్యుత్ రంగంలో బీజేపీ సాధించలేని విజయాన్ని తెలంగాణా సాధించిందని అక్కసుతో ఇలా చేస్తుందని మండిపడ్డారు.

సంవత్సర కాలంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. బీజేపీ వైఫల్యాల పై కేసీఆర్ ప్రశ్నిస్తునందునే తెలంగాణాని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. డబల్ ఇంజన్ సర్కార్లు విఫలమైన సందర్భంలో నూతన రాష్ట్రం తెలంగాణ విజయపదంలో దూసుకెళ్తుండటంతో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Latest news