పవన్ కల్యాణ్ ‘జల్సా’ రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఆనందంలో అభిమానులు..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ‘జల్సా’. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్. కాగా, ఈ మూవీని పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న పలు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ రీ-రిలీజ్ ఫిల్మ్ ట్రైలర్ ను విడుదల చేశారు.

సోషల్ మీడియాలో రీ-రిలీజ్ ట్రైలర్ తెగ వైరలవుతోంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ ఫిల్మ్ రిలీజ్ కాబోతున్నది. దాదాపు 500 షోలు వేయనున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో విడుదలయిన ట్రైలర్ చూసి పవన్ అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.

ట్రైలర్ లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్లు కట్ చేశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ‘జల్సా’ రిలీజ్ అయ్యే థియేటర్లలో టికెట్ల కోసం సినీ లవర్స్ పోటీ పడుతున్నారు.

ఇకపోతే ‘జల్సా’తో పాటు ‘తమ్ముడు’ మూవీని కూడా పలు చోట్ల విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాల అప్ డేట్ కూడా వస్తుందని జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news