కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం – మల్లు రవి

-

తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందే అని అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించారు ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుంది అనడం హాస్యాస్పదం అన్నారు. కోమటిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తామన్నారు మల్లు రవి. కోమటిరెడ్డి కి గతంలో షోకాజ్ నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారని అన్నారు.

తమ్ముడు బిజెపి తరఫున పోటీ చేసినప్పుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కి నష్టం చేశారని.. ఇప్పుడు మళ్లీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు నష్టం చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కేసీఆర్ తో పొత్తులు ఉండే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. కెసిఆర్ లాంటి నియంతను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర తో కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version