ప్రజల్లో ఉన్నప్పుడు ప్రవర్తన అదుపులో ఉంచుకోవాలి.. విజయ్ సేతుపతి పై సుప్రీంకోర్టు ఫైర్..

-

విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని దాదాపు రెండేళ్ల నుంచి ఒక వివాదం వెంటాడుతూనే ఉంది.. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో సైతం కేసు నడుస్తుంది.. అయితే తాజాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు విజయసేతుపతికి తనదైన శైలిలో చురకలు అంటించింది..విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారు అందరికీ తెలిసిందే ముఖ్యంగా సోలో హీరోగా సినిమాల్లో నటిస్తూనే వైవిధ్యభరితమైన పాత్రలతో అభిమానుల్ని నేర్పిస్తున్నారు అలాగే ప్రతి నాయకుడి పాత్రలో సైతం కనిపించి అలరిస్తున్నారు అలాగే కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతటి ఘనవిజయం సాధించింది అంటే.. అందులో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్ర ప్రాధాన్యత ఎంతైనా ఉంది. విలన్ గా అద్భుతమైన నటనతో విజయ్ సేతుపతి మెప్పించాడు. అయితే విజయ్ సేతుపతిని రెండేళ్ల నుంచి ఓ వివాదం వెంటాడుతూనే ఉంది.

దాదాపు రెండేళ్ల క్రితం విజయ్ సేతుపతి బెంగుళూరు విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. అయితే మహా గాంధీ తనపై విజయ్ సేతుపతి అతని మనుషులు అటాక్ చేశారు అంటూ కోర్టులో కేసు నమోదు చేశారు. ఒక విషయంలో విజయ్ సేతుపతికి మహా గాంధీకి మధ్య విభేదాలు వచ్చాయని దీంతో గొడవ పెరిగి పెద్దదైందంటూ వార్తలు వినిపించాయి అంతేకాకుండా అప్పట్లో విజయ్ సేతుపతి మనుషులని పెట్టి మహా గాంధీని కొట్టినట్టు సోషల్ మీడియాలో సైతం దృశ్యాలు వైరల్ గా మారాయి.. అయితే ప్రస్తుతం ఈ కేసు పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే..\

అయితే తాజాగా ఈ విషయంపై సుప్రీం కోర్టు విజయ్ సేతుపతికి చురకలు అంటించింది. సెలెబ్రిటీలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు.. అలాగే విజయ్ సేతుపతి స్టార్ హీరో.. కాబట్టి ప్రజల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన అదుపులో ఉండాలనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజలని తిడుతూ సెలెబ్రిటీలు వారి మధ్యలోనే తిరగడం సాధ్యం కాదు కదా.. అని సుప్రీం కోర్టు పేర్కొంది.

అలాగే ఈ కేసు విషయంలో వీరిద్దరికీ సుప్రీంకోర్టు ఒక సలహా సైతం ఇచ్చింది చర్చల ద్వారా ఇద్దరికీ అంగీకారం అయితే ఈ సమస్యను తేల్చుకోవాలని సూచించింది అందుకు అవసరమైన ఏర్పాట్లు సైతం చేస్తామని చెప్పుకొచ్చింది అలాగే తమ సమాధానం చెప్పేందుకు వీరిద్దరూ తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కావాలని తెలిపింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version