వామ్మో.. డైలాగ్ కింగ్ సాయికుమార్.. బిగ్ బీ టూ సూపర్ స్టార్.. డైలాగ్స్ చెప్తే సంచలనమే..!!

-

కనిపించే ఆ మూడు సింహాలు.. చట్టానికి.. న్యాయానికి.. ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్.. ఈ ఒక్క డైలాగ్ చాలు సాయికుమార్ ను డైలాగ్ కింగ్ అని చెప్పడానికి. ముఖ్యంగా ఈయన తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా బిగ్ బి నుంచి సూపర్ స్టార్ వరకు ఇలా ప్రతి ఒక్కరి స్టార్ హీరోకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి తన డైలాగులతో థియేటర్లు దద్దరిల్లేలా చేశారు సాయి కుమార్. ఇక పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ముఖ్యంగా సాయికుమార్ ఏ హీరోకు డైలాగ్ చెప్పినా సరే అది అదిరిపోవాల్సిందే. అంతలా వేరే భాషల్లో కూడా యాక్ట్ చేసిన హీరోలకు తన తెలుగు డబ్బింగ్ తో వాళ్లను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశారు. ముఖ్యంగా రజినీకాంత్ బాషా సినిమా చూసిన వారు తప్పకుండా సాయికుమార్ డైలాగులను ఇట్టే కనిపెట్టవచ్చు. ముఖ్యంగా బాషా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా ఇక రజినీకాంత్ చెప్పిన ఈ డైలాగులు థియేటర్స్ లో పేలడం వెనుక వున్నది ఎవరో కాదు మన డైలాగ్ కింగ్ సాయికుమార్. అంతేకాదు పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చేసిన పాపారాయుడు పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు. ఇక రజనీకాంత్ కు మాత్రమే కాదు అంకుశం సినిమాలో రాజశేఖర్ పాత్ర అంతలా పండడానికి కూడా కారణం సాయికుమార్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

సుమన్ హీరోగా నటించిన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు కూడా గాత్ర దానం చేసింది సాయికుమార్ గారే. కేవలం తెలుగు హీరోలకే కాదు ఇక్కడ డబ్ అయిన చాలా చిత్రాలకు కూడా ఆయన తన గొంతుతో ప్రాణ ప్రతిష్ట చేసి కింగ్ ఆఫ్ వాయిస్ గా ఫేమస్ అయ్యారు. కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా తండ్రిగా, విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హోస్ట్ గా ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలకు తన నటనతో జీవం పోశారు. ఇక ఈయన 1960 జూలై 27వ తేదీన మద్రాసులో ప్రముఖ నటుడు పీజే శర్మ కృష్ణ – జ్యోతి దంపతులకు జన్మించారు. ఇక ఈయన కుమారుడు ఆది సాయికుమార్.

Read more RELATED
Recommended to you

Latest news