తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఏవంటే..!!

-

ప్రతి మానవుడికి జీవితంలో ఒక కల ఉంటుంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలని, ఆ ఇంటిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కట్టించుకోవాలని కలలు కంటారు. మన పెద్దవాళ్ళు ఒకమాట అనేవారు గుర్తుందా… ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు అని… అయితే సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు చాలా డబ్బులు కావాలి..కానీ ఆ డబ్బులు ఉండవు. అందుకే చాలా మంది బ్యాంకులను ఆశ్రయించి, హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేస్తుంటారు.

అయితే లోన్ తీసుకున్నాము అంటే మాటలు కాదు.. నెల నెల తీసుకున్న మొత్తానికి వడ్డీ కట్టాలి. అయితే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు అనేది బ్యాంక్ ను బట్టి మారుతూ ఉంటుంది. అందువల్ల మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీ ఉందో ముందు తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఎంత? ఇతర చార్జీల ఎంత ఉంటాయి అన్న విషయాలను గమనించాలి. అటుపైనే హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవాలి. మీ కలని నిజం చేయడానికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు గురించిన వివరాలను మీకు అందిస్తున్నాము. అవేంటో తెలుసుకోండి.. !! ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్స్‌పై 0.25 శాతం వడ్డీ తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేయడం లేదు. వడ్డీ రేటు 7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అలాగే దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI )కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఉంది. హోమ్ లోన్ కావాలనుకునే వారు తప్పక యోనో యాప్ ద్వారానే లోన్‌ కోసం అప్లై చేసుకోవాలి. ఇక వడ్డీ విషయానికి వస్తే వడ్డీ రేటు 6.95 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

హోమ్ లోన్ తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకుల లిస్ట్ లో ఉన్న బ్యాంకు ఏదంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB.ఈ బ్యాంకు పండుగ ఆఫర్‌లో హోమ్ లోన్ అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర చార్జీలను మాఫీ చేసింది. వడ్డీ రేటు 7.1 శాతం నుంచి ప్రారంభమౌతోంది.కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. 7 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమౌతోంది. అంతేకాకుండా బ్యాంక్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా Bank of India కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.85 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కానీ ఈ బ్యాంకులో 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.Central Bank of Indiaలో హోమ్ లోన్స్ 6.85 శాతం నుంచి ప్రారంభమౌతోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం పడుతుంది. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ HDFC Bank కూడా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. వడ్డీ రేటు 6.95 శాతం నుంచే ప్రారంభమౌతోంది.. ప్రైవేట్ రంగానికి చెందిన మరో ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఫెస్టివ్ బొనాంజా అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.3,000 నుంచి పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news