వావ్.. పటిక నీటితో ముఖం కడుక్కుంటే ఇన్ని లాభాలా..?

-

పటిక వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదైతే.. ఆ వాటర్ తో ముఖం కడుక్కోవడం వల్ల అందానికి మంచిది.. తెలుసా.. పటిక వాటర్ తో స్కిన్ ఎంత బాగుంటుందో.. ఇలా కామన్ గా ఉండే.. మచ్చలు, మొటిమలు, ముడతల సమస్య కూడా పోతుందట.. మరి పటిక వాటర్ ను ఎలా వాడాలో చూద్దామా..!

రోజుకు ఒకసారి పటిక నీటితో ముఖం కడుక్కుంటే.. చర్మంపై మచ్చలు పోతాయి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఈరోజుల్లో అన్ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల.. 30 ఏంటర్ అవడంతోనే.. కొందరికి ముడతలు వస్తున్నాయి. దీంతో ఏజ్ లుక్ ముఖం మీద కనిపిస్తుంది. ఈ సమస్య పోయి.. యవ్వనంగా కనిపించాలంటే.. పటికి వాటర్ తో మసాజ్ చేసి.. చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే సరి.. డైలీ ఇలా చేస్తుంటే.. ఫేస్ పై ముడతలు ఉండవు.

కాలుష్యం వల్ల చాలామంది స్కిన్ లూస్ అయిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. పటిక పొడిని తీసుకుని అందులో రోజ్ వాటర్, ఎగ్ వైట్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల్లో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై స్కిన్ టైట్ గా అవుతుంది.

ఒక ఏజ్ వరకూ.. ముఖంపై మొటిమలు ఏర్పడటం కామన్.. కానీ వాటిని తొలగించకపోతే చర్మంపై మచ్చలుగా మిగులుతాయి. వాటిని తొలగించడానికి పటికను పేస్ట్ చేసి మొటిమల మీద రాయండి. మంచి ఫలితం ఉంటుంది.

ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి కూడా పటిక అద్భుతంగా పనిచేస్తుంది. అర టీస్పూన్ పటిక పొడిని తీసుకుని అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి అవాంఛిత రోమాలపై అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. క్లీన్ చేసేప్పుడు రివర్స్ డైరెక్షన్ లో రబ్ చేసి క్లీన్ చేస్తే.. హెయిర్ పోతుంది.

ఇలా పటికతో ముఖాన్ని అందంగా మార్చేసుకోవచ్చు. ఖర్చు తక్కువ రిజల్ట్ ఎక్కువ. అయితే పటికను మాత్రం మంచి క్వాలిటీ ఉన్నది ఎంచుకోవాలని గుర్తుంచుకోండి..!

Read more RELATED
Recommended to you

Latest news