ఐపీఎల్ 2022 లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలం అవుతున్న విషయం తెలిసిందే. బుధవారం పంజాబ్ చేతిలో ఓడిపోవడంతో.. ఈ సీజన్ లో ముంబై ఈ సీజన్ లో వరుసగా 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో నిరాశలో ఉన్న ముంబై అభిమానులకు కాస్త ఊరటను ఇచ్చే విధంగా రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వ ఓవర్ లో రబడ వేసిన బంతిని సిక్స్ కొట్టడంతో.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
టీ 20 ల్లో 10,000 పరుగుల సాధించిన క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల పరుగుల మార్క్ అందుకున్న 7వ ఆటగాడుగా రికార్డు నమోదు చేశాడు. అలాగే భారత తరపున టీ 20 ల్లో 10 వేల పరుగుల చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. భారత్ తరపున రోహిత్ శర్మకు ముందు.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.
అలాగే ఐపీఎల్ లో 500 ఫోర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ల క్లబ్ లో రోహిత్ శర్మ చేరాడు. రోహిత్ కన్న ముందు., శిఖర్ ధవాన్ 668 ఫోర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి విరాట్ కోహ్లి 554, డేవిడ్ వార్నర్ 531, సురేష్ రైనా 506 తో ఉన్నారు.