ఈ కాలంలో విరివిగా లభించే పండ్లల్లో శీతాఫలం చాలా ముఖ్యమైనది. మధురమైన రుచిని అందించడంతో పాటు శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు సీతాఫలం సొంతం.ఇందులో విటమిన్ ఎ,బి,సి, మెగ్నీషియం,కాపర్,పొటాషియం, ఫైబర్, ఐరన్ ఉన్నాయి.పురుషులలో ఏర్పడే నరాల బలహీనత మరియు కండరాల వృద్ధిని పెంచే గుణాలు శీతాకాలంలో మెండుగా ఉన్నాయి. అందువల్ల నరాల బలహీనత సమస్యతో బాధపడే పురుషులు ఉదయాన్నే ఒక సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవడమే కాకుండా, శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు.
మీరు సన్నగా బలహీనంగా ఉన్నారా… అయితే దీనికి సీతాఫలం ఒక చక్కని పరిష్కారం చూపుతుంది. సీతా ఫలాన్ని మరియు తేనెను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆరోగ్యవంతమైన బరువును పొందుతారు. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది.బరువు తగ్గాలి అనుకునే వారికి సీతాఫలం ఒక చక్కని రెమెడీ అని చెప్పవచ్చు. ఈ కాలంలో విరివిగా దొరికే సీతాఫలాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన అది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను బయటకు పంపి ఊబకాయం మరియు అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది.ఇందులో ఉండే మెగ్నీషియం ఆస్తమా మరియు హార్ట్ ఎటాక్ నుంచి కాపాడుతుంది.
సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల గర్భణి స్త్రీలకు సుఖప్రసవం అందుతుంది. కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు,నాడి వ్యవస్థ మెరుగుపడుతుంది.తల్లి యొక్క పాల ఉత్పత్తిని పెంచడంలో సీతాఫలం అమోఘంగా సహాయపడుతుంది.మలబద్ధకంతో బాధపడే వారికి సీతాఫలం నిజంగా ఒక వరంగా చెప్పవచ్చు.ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలాన్ని జ్యూస్ గా లేదా నేరుగా తీసుకోవడం వల్ల ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అల్సర్, గ్యాస్,ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది.