ఏం క్రియేటివిటీ రా నాయనా.. ఇంజినీర్స్ కూడా తక్కువే..

-

కరోనా వచ్చి వెళ్ళాక చాలా మందికి చావు తెలివి తేటలు వచ్చాయి అనడంలో సందేహం లేదు.. దాంతో ఇప్పుడు కొత్త కొత్త వాటిని ఇన్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి కొంత మందికి పైత్యం ముదురి ఏదేదో చేస్తున్నారు..తమ తెలివితేటలను, సామర్ధ్యాన్ని ఏదొక సమయంలో బయటపెడుతుంటారు.గొప్ప ఇన్వెన్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వాడకం పెరిగిపోవడంతో సామాన్యులు చేస్తోన్న సరికొత్త ఇన్వెన్షన్లు.. ఇంజినీర్లను సైతం సలాం కొట్టేలా చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుడ్ కు సంభందించిన వీడియోలు రకరకాల వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..ఇప్పుడేమో వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు మనుషులకు పిచ్చెక్కిస్తుంది.ఇంజినీర్లను సైతం సలాం కొట్టేలా చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం మరి..

మీరు బట్టలు ఇస్త్రీ చేసేవాడిని.. ఐరన్ బాక్స్, బొగ్గులతో చేయడం చూసే ఉంటారు.. అయితే గ్యాస్ సిలిండర్‌తో ఇస్త్రీ చేస్తుండటం ఎప్పుడైనా చూశారా.? అయితే ఈ వీడియో మీకోసమే.. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ సహాయంతో బట్టలు ఇస్త్రీ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అసలు గ్యాస్ సిలిండర్‌తో ఎలా ఇస్త్రీ చేస్తున్నావ్ అని అతడ్ని అడగ్గా.. ఏమో తనకు తెలియదని.. గత నాలుగేళ్లుగా ఈ విధంగానే బట్టలు ఇస్త్రీ చేస్తున్నానని అతడు చెప్పుకొచ్చాడు.ఈ వీడియోనుఅప్‌లోడ్ చేయగా.. వేల సంఖ్యలో వ్యూస్, లైకులు వచ్చిపడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌ చేస్తున్నారు.. మీరు కూడా ఆ వీడియో పై లుక్ వేసుకోండి..

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

Read more RELATED
Recommended to you

Latest news