విద్యార్థులను సంతోషపెట్టిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారంటే?

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సభ కోసం ఆయన జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాన్ తొలిసారి కడపలో పర్యటిస్తున్నందున అందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే, తమ అభిమాన హీరో పవన్ కళ్యాన్ డిప్యూటీ సీఎం హోదాలో కడపకు రావడంతో జనసైనికులు పెద్ద ఎత్తున ఆయన్ను చూసేందుకు విచ్చేశారు. రహదారులన్నీ జనసేన జెండాలతో పరుచుకున్నాయి. పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా కడప కార్పొరేషన్ హైస్కూల్‌ను విజిట్ చేసిన పవన్.. 6వ తరగతి విద్యార్థుతలతో ముచ్చటించారు. అనంతరం వారి పుస్తకాల మీద ఆటోగ్రాఫ్ చేసి చిన్నారులను సంతోషపరిచాడు.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news