సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ మీద ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. రియాతో పాటు తన తమ్ముడు షోవిక్ చక్రవర్తి కూడా అరెస్ట్ అయ్యాడు. కానీ బాంబే హైకోర్టు షోవిక్ చక్రవర్తికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఐతే దాదాపు నెలరోజుల పాటు జైళ్ళో ఉన్న రియా చక్రవర్తి ఏం చేసిందనేది అందరికీ ఆసక్తిగా మారింది.
రియా లాయర్ సతీష్ మనేషిండే చెప్పిన కథనం ప్రకారం, జైళ్ళో ఉన్న రియా చక్రవర్తి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట. తనని తాను ఆర్మీ సైనికురాలిలాగా మలచుకుని జైలు పరిస్థితులకి అనుగుణంగా మలుచుకుందట. దానికోసం యోగా కూడా చేసిందట. తానే కాదు తనతో పాటు జైళ్ళో ఉన్న వారికి యోగా పాఠాలు నేర్పిందట. ప్రతికూల ఆలోచనలు రాకుండా తనని తాను బలంగా ఉంచుకోవడానికి యోగా చేస్తూనే ఇతరులకి కూడా నేర్పిందట.